News

ప్రసంగిస్తూనే ప్రాణాలు వదిలిన మహాస్వామీజీ

738views

బెంగళూరు: కర్ణాటకలోని బెళగాంలో విషాదం చోటుచేసుకుంది. ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న స్వామీజీ గుండెపోటుకు గురై వేదికపైనే మరణించారు. ఈ ఘటన ఈ నెల ఆరోతేదీన జరిగింది. సంగనబసవ స్వామి తన అనుచరులను ఉద్దేశించి మాట్లాడుతుండగా ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

తన జన్మదిన వేడుకలకు హాజరైన భక్తులను ఉద్దేశించి బలోబల మఠం పీఠాధిపతి సంగనబసవ మహాస్వామీజీ ప్రసంగం ప్రారంభించారు. అలా మాట్లాడుతుండగా ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఈ నెల ఆరోతేదీన తన 53వ పుట్టినరోజు కావడంతో తన మఠంలో అనుచరులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రసంగం సమయంలో ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. కూర్చున్న కుర్చీలోనే తల వెనక్కి వాల్చి కన్నుమూశారు. పక్కనే ఉన్న స్వామీజీ, భక్తులు వెంటనే అప్రమత్తమై ఆసుపత్రికి తరలించినా ఆయన్ను కాపాడుకోలేకపోయారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి