
675views
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌లు వర్చువల్‌గా సమావేశమైయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మన మధ్య నెలకొన్న పోటీనీ ఘర్షణపూరితంగా మారకుండా చూసే బాధ్యత తమపై ఉందని భేటీ ప్రారంభంలో జిన్‌పింగ్‌తో బైడెన్ అన్నారు. తన పాత మిత్రుడ్ని కలవడం సంతోషంగా ఉందని జిన్‌పింగ్ బైడెన్‌తో పేర్కొన్నారు. అమెరికా-చైనా సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా తాను బైడెన్‌తో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు.





