News

శ్రీశైలంలో ఘనంగా కోటి దీపోత్సవం

822views

శ్రీ‌శైలం: శ్రీశైల క్షేత్రంలో కార్తీక సోమవారం సందర్భంగా లక్ష దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీస్వామి అమ్మ వార్ల ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు, వేదపండితులు ఆలయ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చిన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పుష్కరిణి చుట్టూ లక్ష కార్తీక దీపాలు సిద్ధం చేసి దశవిధ హారతులు సమర్పించారు. దీపాల వెలుగులతో పుష్కరిణి ప్రదేశం దేదీప్యమానంగా దర్శనమిచ్చింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి