
421views
-
12 మందికి గాయాలు
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లోని మసీదులో మళ్ళీ బాంబు పేలింది. ఈ దుర్ఘటనలో సుమారు 12 మందికి గాయాలయ్యాయి. నంగర్హర్ ప్రావిన్స్‌లోని స్పిన్ ఘర్ ప్రాంతంలోని మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో స్థానిక ముల్లాతో సహా కనీసం 12 మంది గాయపడ్డారని స్థానికులు చెప్పారు. మధ్యాహ్నం 1:30 గంటలకు మసీదు లోపలి భాగంలో పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలిపోయాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.
Source: Tv9
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





