News

చైనా కొత్త సరిహద్దు చట్టం… భారత్ ప్రయోజనాలకు విఘాతం!

647views

న్యూఢిల్లీ: చైనా నూతన జాతీయ సరిహద్దు చట్టాన్ని తీసుకొచ్చింది. సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా చేపట్టే పనులను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలైనా చేపడుతుందని చట్టంలో పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన సహా సరిహద్దు రక్షణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం పాటు పడనున్నట్టు తెలిపింది. సరిహద్దుల్లో ప్రజలు నివసించేలా, పని చేసుకునేలా ప్రోత్సహించనున్నట్టు వెల్లడించింది.

చైనా తీసుకొచ్చిన తాజా చట్టం భారత్​తో సరిహద్దు వివాదంపై ప్రభావం చూపే అవకాశం ఉంద‌ని ప‌లువురు భావిస్తున్నారు. భారత్, భూటాన్ దేశాలతో చైనాకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి. భారత్​తో 3,488 కిలోమీటర్లు, భూటాన్​తో 400 కి.మీ మేర సరిహద్దు వివాదాస్పదంగా ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి