News

1.77 లక్షల ఏళ్ల కిందటే భారత్‌లో మానవ మనుగడ

1kviews
  • తాజా అధ్యయనంలో వెల్లడి

రాజస్థాన్‌: అండాకార రాతి గొడ్డళ్ల వంటి పనిముట్లను ఉపయోగించిన ఆది మానవులు భారత్‌లో 1.77 లక్షల ఏళ్ల క్రితం జీవించి ఉన్నారని తాజా అధ్యయనమొకటి తేల్చింది. ఆసియా వ్యాప్తంగా హోమో సెపియన్ల విస్తరణ చోటుచేసుకోవడానికి కాస్త ముందు దాకా వీరి మనుగడ కొనసాగినట్లు నిర్ధారించింది. ‘అషూలియన్‌’ అనేది చరిత్ర పూర్వయుగంలో దీర్ఘకాలంపాటు పనిముట్ల తయారీకి ఉపయోగించిన విధానం.

అండాకారంలో, బేరీపండు రూపంలో గొడ్డళ్ల వంటి రాతి పనిముట్లను ఈ విధానంలో తయారుచేసేవారు. రాజస్థాన్‌లోని థార్‌ ఎడారిలో సింగీ తలావ్‌ అనే ప్రాంతంలో జర్మనీకి చెందిన మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ది సైన్స్‌ ఆఫ్‌ హ్యూమన్‌ హిస్టరీ పరిశోధకులు విస్తృత అధ్యయనం చేపట్టి, ఆది మానవుల మనుగడకు సంబంధించి తాజాగా కీలక విషయాలు వెల్లడిరచారు. భారత్‌లో అషూలియన్లకు సంబంధించి అత్యంత పురాతన కేంద్రంగా సింగీ తలావ్‌ను ఇన్నాళ్లూ భావించగా.. అది తప్పని పరిశోధకులు తాజాగా తేల్చారు. 1.77 లక్షల ఏళ్ల క్రితం వరకూ అక్కడ అషూలియన్‌ ఆది మానవులు నివసించినట్టు నిర్ధారించారు. ప్రపంచంలో అషూలియన్లు ఆలస్యంగా అంతరించిపోయిన దేశాల్లో భారత్‌ ఒకటని వెల్ల‌డించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి