
న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాకీ సమాఖ్య వార్షిక అవార్డుల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. బుధవారం ప్రకటించిన అవార్డుల్లో అన్ని విభాగాల్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. పురుషుల్లో ఉత్తమ ఆటగాడిగా హర్మన్‌ప్రీత్ సింగ్, మహిళల్లో గుర్జీత్ కౌర్ నిలిచారు. ఉత్తమ గోల్‌కీపర్లుగా వెటరన్ ఆటగాడు శ్రీజేష్(పురుషుల), సవిత పునియా(మహిళల) అవార్డులు సొంతం చేసుకున్నారు.
యువ ప్లేయర్లు వివేక్ సాగర్ ప్రసాద్(పురుషుల), షర్మిల దేవి(మహిళల) ఉత్తమ వర్థమాన స్టార్లుగా నిలిచారు. ఉత్తమ కోచ్‌లుగా గ్రహమ్ రీడ్(పురుషుల), మరీన్(మహిళల) అవార్డులు దక్కించుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన భారత పురుషుల జట్టు.. 41 ఏళ్ల తర్వాత హాకీలో దేశానికి పతకం అందించిన సంగతి తెలిసిందే. అద్భుత ప్రదర్శన చేసిన అమ్మాయిలు పతకానికి అడుగు దూరంలో ఆగిపోయి నాలుగో స్థానంతో సంతృప్తి చెందారు. హర్మన్‌ప్రీత్, గుర్జీత్ తమ జట్ల తరపున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్లుగా నిలిచారు.





