News

భారతీయ సంస్కృతిని రక్షించుకోవడం నేటి అవసరం

658views
  • ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ కార్య‌వాహ్‌ దత్తాత్రేయ హోసబలే

గౌహతి: భారతీయ సంస్కృతీసంప్రదాయాలను రక్షించుకోవడం నేటి అవసరమని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌ కార్య‌వాహ్‌ దత్తాత్రేయ హోసబలే అన్నారు. గువాహటిలో గురువారం(సెప్టెంబర్‌ 30) ‘గిరిజనుల సామాజిక`ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్‌లో దత్తాత్రేయ హోసబలే మాట్లాడారు.

మూడు, నాలుగు తరాల ‘టీ కథ’లను తీసుకొని ‘చిత్ర ప్రదర్శన’ను ఏర్పాటు చేయాలని సూచించారు. అసోంలోని ఈ తెగలు భవిష్యత్‌ తరానికి మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకమైన అసలైన చరిత్రను అందజేస్తాయన్నారు. భారతీయ సంస్కృతి యొక్క గొప్ప వారసత్వాన్ని, సాహిత్యంలో దాని పురాతన సంప్రదాయాలను పరిరక్షించడం తక్షణావసరం అని పేర్కొన్నారు.

బిటీష్‌ కాలంలో అసోంతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించిన టీ తెగ చరిత్రను హోసబాలే గుర్తుచేసుకుంటూ, ‘వారు కష్టపడి, చెమటతో దేశాన్ని నిర్మించే వారిగా ప్రసిద్ధి పొంది, దేశానికి ఉత్తమ మార్గాన్ని చూపారు’ అని అన్నారు. ట్రినిడాడ్‌, గయానాల ప్రజలు లెక్కలేనన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ వారి సంస్కృతి, మతాన్ని మరచిపోలేదని ఉదహరించారు.

మన పురాతన సంస్కృతిని కాపాడటంలో సాహిత్యం ప్రాముఖ్యతను దత్తాత్రేయాజీ నొక్కిచెప్పారు. ‘ప్రజల ఆర్థిక పరిస్థితులు సుసంపన్నం అయినప్పుడు జీవితం విలువ బాగా అర్థం అవుతుంది. నైతిక మార్గాల ద్వారా ఒకరి ఆర్థిక స్థితిని మెరుగుపరచడం అనేది గౌరవించదగినది’ అని అన్నారు.

సంక్షోభ కాలంలో, మెరుగైన జీవనోపాధి కోసం ఒకరికొకరు సహకరించుకోవడం అవసరం… ఆరోగ్యం, విద్యా అవసరాల కోసం వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సరిగ్గా వినియోగించుకోవాలని దత్తాత్రేయ అన్నారు. సమాజంలో విద్యావంతులైన ఉన్నత వర్గాలు ఇతర వర్గాలకు తప్పక మార్గనిర్దేశం చేయాలని కోరారు. మాధబ్‌ దేవ్‌ ఇంటర్నేషనల్‌ ఆడిటోరియంలో జరిగిన ఈ సెమినార్‌లో పెట్రోలియం రామేశ్వర్‌ టెలి యూనియన్‌ మోస్‌, తేయాక పంటపై ఆధారపడి జీవిస్తున్న 108 టీ సామాజిక వర్గాల ప్రముఖులు పాల్గొన్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి