
5views
రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గం గోపవరం గ్రామంలో ఉన్న గుబ్బాలమ్మ తల్లి ఆలయం పునర్నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేవాదాయ శాఖతో సమన్వయంతో తొలి విడతగా రూ.60 లక్షల వ్యయంతో ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.
గోదావరి పుష్కరాల నాటికి రాష్ట్రంలోని పలు దేవాలయాల జీర్ణోద్ధరణ పూర్తి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.





