
735views
-
వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం విషాదం చోటు చేసుకుంది. చామరాజపేట్ రాయల్ సర్కిల్ పరిధిలోని ఓ ఇంట్లో బాణసంచా పేలిన ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని విక్టోరియా హాస్పిటల్‌కు స్థానికులు తరలించారు. ఓ వ్యక్తి బాణసంచా తరలిస్తుండగా.ఈ దుర్ఘటన సంభవించిందని అంచనా వేస్తున్నారు.
ఎక్కువగా రద్దీ ఉన్న ప్రదేశంలో ఈ పేలుడు జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. పేలుడు తీవ్రతకుసా ముగ్గురు వంద మీటర్ల దూరానికి ఎగిరి పడ్డారు. అక్కడున్న వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Source: Tv9





