
-
అధికారుల తీరుపై రేగిన వివాదం
-
హిందూ సంస్థలు ఫైర్
మైసూరు: కర్ణాటకలోని మైసూరులో మహాదేవమ్మ ఆలయాల్ని అధికారులు కూల్చివేశారు. దీంతో వివాదం రేగింది. ఈ నెల ఎనిమిదోతేదీ తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనపై ప్రతిపక్షం, అనేక హిందూ సంస్థలు, అధికార బీజేపీకి చెందిన కొందరు నాయకులు కూడా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
కర్ణాటక అంతటా ‘చట్టవిరుద్ధమైన’ మతపరమైన కట్టడాలను కూల్చివేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాన్ని తాము పాటించామని, ఈ దేవాలయం నిర్మించి, కేవలం 12 ఏళ్ళు మాత్రమే అవుతుందని, భారత పురావస్తు సర్వే(ఏఎస్‌ఐ) మ్యాప్‌లలో లేదని జిల్లా అధికారులు ఆందోళనకారులకు వివరించారు. అయినా, వారు శాంతించలేదు.
ఆలయాన్ని కూల్చే ముందు నోటీసు ఇవ్వలేదు సరికదా… కనీసం సమాచారం ముందుగా ఇవ్వలేదని ఆందోళనకారులు దుమ్మెత్తిపోశారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయ్ మంగళవారం కూల్చివేతలను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశం ‘సమగ్ర అధ్యయనం’ తర్వాత ‘నిర్దిష్ట ఆదేశాలు’ జారీ చేస్తామని చెప్పారు.
https://twitter.com/i/status/1436655209409695747
Source: Tv9(English)
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





