News

భారీ పేలుడుకు మావోల యత్నం… భగ్నం చేసిన భద్రత దళాలు

686views

ఝార్ఖండ్​​: మావోయిస్టుల చ‌ర్య‌లు ఆగ‌డం లేదు. నిఘా ద‌ళాలు అప్ర‌మ‌త్తంగా ఉండ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఝార్ఖండ్​​లో సెంట్రల్ రిజర్వ్​ పోలీస్​ దళాదళాలు, స్థానిక పోలీసులు భారీ పేలుడు కుట్రను భగ్నం చేశారు. బుధవారం ఉదయం 15కిలో ఐఈడీని స్వాధీనం చేసుకొని, పెను దాడిని అడ్డుకున్నారు. నిఘా వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సీఆర్​పీఎఫ్​ 154 బెటాలియన్​​ దళం సభ్యులు, ఝార్ఖండ్​​ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. అనుమానిత సీతూ ప్రాంతాంతో అణువణువూ పరిశీలించారు.

ఈ గాలింపులో మక్కాన్​-చేచారియ మధ్య ఉన్న ఓ కల్వర్టు వద్ద 15 కిలోల శక్తిమంతమైన ఐఈడీ ఉన్నట్టు గుర్తించారు. బాంబ్ స్క్వాడ్ సాయంతో నిర్వీర్యం చేసి, స్వాధీనం చేసుకున్నట్టు సీఆర్​పీఎఫ్​ ఓ ప్రకటనలో తెలిపింది. భద్రతా దళాలే లక్ష్యంగా మావోయిస్టులు ఈ పేలుడుకు కుట్ర పన్నినట్టు నిఘా​ వర్గాలు స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చాయని సీఆర్​పీఎఫ్​ వెల్లడించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి