
518views
తాలిబన్లతో చైనా దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. కాబుల్లో తొలి దౌత్యపరమైన సంప్రదింపులు చేపట్టింది. ఇరువురి మధ్య అవరోధం లేకుండా సంభాషణ జరుగుతోందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ వెల్లడించారు.
తాలిబన్ల విషయంలో తొలి నుంచీ చైనా అనుకూల వైఖరే అవలంబిస్తోంది. సాయుధులు అఫ్గాన్ ను ఆక్రమించుకున్నప్పటికీ ఆ దేశంలోని రాయబార కార్యాలయాన్ని చైనా మూసేయలేదు. అటు, తాలిబన్లు సైతం అఫ్గన్ పునర్నిర్మాణంలో చైనా కీలక పాత్ర పోషించగలదని బహిరంగంగా వ్యాఖ్యానించారు. గత నెలలో తాలిబన్ నేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ తో.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సమావేశమయ్యారు.





