News

రాత్రి 9 తర్వాత బయటకు వచ్చే మహిళలంతా వేశ్యలే.. వారిని అత్యాచారం, హత్య చేసినా తప్పు లేదు… కేరళ ముస్లిం మత పెద్ద వివాదాస్పద వ్యాఖ్యలు… వైరల్ అయిన వీడియో… దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు

734views

కేరళకు చెందిన ఇస్లామిక్ మత గురువు మహిళలను కించపరుస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇందుకు సంబంధించి ఓ వీడియోలో సోషల్ మీడియలో వైరల్ మారడంతో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

రాత్రి 9 గంటలు దాటిన తర్వాత రోడ్లపై కనిపించే మహిళలందరూ వేశ్యలేనని, వారిని అత్యాచారం చేసినా, హత్య చేసినా తప్పు కాదని కేరళ ముస్లిం మతాధికారి స్వాలి బత్రే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2011లో జరిగిన ఓ అత్యాచారాన్ని సమర్థిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 2011లో గోవిందస్వామి అనే వ్యక్తి ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా గాయపరిచాడు. ఐదు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో స్థానిక కోర్టు గోవింద స్వామికి ఉరిశిక్ష విధించగా.. 2016లో ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఉరిశిక్షను 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా మార్చింది. ఈ ఘటనపై స్వాలి బత్రే తాజాగా స్పందించారు. ‘రాత్రిపూట ప్రయాణించే మహిళలందరూ వేశ్యలే. అత్యాచారానికి గురైన బాలిక కూడా రాత్రి పూట ప్రయాణిస్తోంది కాబట్టే గోవింద స్వామికి చిక్కింది. అందులో అతని తప్పేం ఉంది. రాత్రిపూట బయట కనిపించే మహిళలపై అత్యాచారానికి పాల్పడడం, చంపడం తప్పు కాదు’ అని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. ఆయన మాటలు రికార్డు చేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.