News

రాష్ట్ర ప్రభుత్వాల గ్లోబల్ గప్పాలకు స్పందనేదీ?

482views

కోటి కొవిడ్‌ టీకా డోసులు కొనుగోలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానిస్తే ఎలాంటి స్పందన రాలేదు. బిడ్లు దాఖలు చేసేందుకు గడువు ఈరోజు సాయంత్రంతో ముగియగా.. ఒక్క ఫార్మా సంస్థ కూడా బిడ్‌ దాఖలు చేసేందుకు ముందుకు రాలేదు.

కోవిడ్‌ టీకాలు గ్లోబల్‌ టెండర్ల ద్వారా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో నిర్ణయించింది. ఈమేరకు గత నెల 26న ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించగా.. ఆస్ట్రాజెనికా, స్పుత్నిక్‌-వి కంపెనీల ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారు. అయతే, బిడ్ల దాఖలుకు సంబంధించిన గడువు ఈరోజు సాయంత్రం 6గంటలకు ముగియగా ఏ ఒక్క కంపెనీ కూడా బిడ్‌ దాఖలు చేయలేదు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ తదితర రాష్ట్రాలు టీకాల కొనుగోలుకు గ్లోబల్‌ టెండర్లు పిలిచినా ఫార్మా సంస్థల నుంచి స్పందన లేని విషయం తెలిసిందే.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.