News

ఆ దృశ్యాలు పీడకలలా వెంటాడుతున్నాయ్ – ముస్లిముల మూక దాడిపై మహా దళితులు

953views

బీహార్లోని పుర్నియా జిల్లా మఝువా గ్రామంలోని మహా దళితులపై మే 19న జరిగిన దాడి వారి పాలిట పీడకలలా మారింది. “ఆ దృశ్యాలు మా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. మరుద్దామన్నా మరపు రాకున్నాయి.” అంటూ పదే పదే ఆ దృశ్యాలను తలచుకొని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆనాడు వారి దాడిలో గాయపడిన నాలుగు నెలల గర్భిణి చెబుతున్న తన భయంకర అనుభవాన్ని వింటే ఎటువంటి వారైనా భయభ్రాంతులకు లోనవక తప్పదు. గర్భిణినని కూడా చూడకుండా నలుగురైదుగురు దుండగులు కలిసి తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని, తాను తీవ్రంగా ప్రతిఘటించడంతో తమ చేతులలోని చైన్ లతో తనను దారుణంగా కొట్టారని చెబుతూ ఆమె తన ఒంటి మీది గాయాలను కూడా చూపారు. ఆ సంఘటన తనను ఒక పీడకలగా వెంటాడుతున్నదని, తనను తీవ్ర భయకంపితురాలిని చేస్తోందని ఆమె తెలిపారు.

ఈనెల 19న 200 మంది ముస్లిం మూక బీహార్ పూర్నియా జిల్లాలోని మఝువా గ్రామానికి చెందిన ఒక మహా దళిత్ కాలనీపై దాడి చేసిన సంగతి తెలిసిందే.

ఆ దాడిలో 15 ఇళ్లను బూడిద చేశారు. దాడికి పాల్పడ్డ వారి ఇండ్లలోని వారికి అనారోగ్యం చేసినప్పుడు, వారి ఇళ్లలోని మహిళలకు కాన్పులు చేయాల్సి వచ్చినప్పుడు తాను ఎంతగానో సాయ పడ్డానని, అయినప్పటికీ దుండగులు తన పైన కూడా దాడికి పాల్పడ్డారని ఆ ప్రాంతంలో ఆశా వర్కర్ గా పనిచేసే మహిళ ఒకరు తెలిపారు. ” నేను వారికి బాగా తెలుసు. అయినా వారదేమీ లెక్క చేయలేదు. నన్ను వారు బలాత్కరించబోయారు. సాధ్యం కాకపోవడంతో నన్ను తీవ్రంగా కొట్టి గాయపరిచారు.” అని ఆమె తెలిపారు.

ఇళ్ళు కాలిపోయిన బాధిత కుటుంబాల వారికి ప్రభుత్వాధికారులు ఇప్పటివరకూ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లూ చెయ్యలేదు. దాడికి పాల్పడ్డ మూక వృద్ధులను, పిల్లలను కూడా వదలక పోవడం గమనార్హం.

వాచ్మెన్ గా పనిచేసి రిటైర్ అయిన 70 ఏళ్ల మేవాలాల్ అనే వ్యక్తిని కూడా దుండగులు చావబాదారు. మూడు సంవత్సరాల బాలుడ్ని తీసుకెళ్ళిపోయారు. చేతులలో ఇనుప రాడ్లు, పెట్రోల్ క్యాన్లు ధరించిన దుండగులు “అల్లాహో అక్బర్” అనే నినాదాలు చేస్తూ బాధితుల ఇళ్లను చుట్టుముట్టారు. దాంతో బాధితులు అందరూ దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయారు. జరిగిన దుర్ఘటన నుంచి వారు ఇప్పటికీ కోలుకోలేక పోతున్నారు.

Source : Organiser

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.