News

రాములోరి కళ్యాణానికి ముస్తాబవుతున్న భద్రాద్రి – ఒంటిమిట్టపై త్వరలో నిర్ణయం

547views

శ్రీరామనవమి వేడుకలకు.. దక్షిణ అయోధ్య.. భద్రాచలం ముస్తాబవుతోంది. ఈనెల 21న కళ్యాణం, 22న పట్టాభిషేకం నిర్వహించనున్నారు. దీనికి శనివారం అంకురార్పణ నిర్వహించారు. గోదావరి పుణ్య జలాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం నిర్వహించి.. అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కోవిడ్ రెండో దశ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

ఒంటిమిట్టపై త్వరలో నిర్ణయం : అధికారులు

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నడిచే ఆలయాలను ఆ శాఖ అధికారులు మూసివేశారు. ఇందులో భాగంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి కూడా తాళాలు వేశారు. స్వామివారికి ఏకాంతంగా పూజలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. పౌర్ణమి నాటి కళ్యాణంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.