News

ఏప్రిల్ 13 ఉగాదినాడు ప్రారంభమవనున్న భూసార సంరక్షణ ఉద్యమం

512views

దేశంలో వ్యవసాయరంగ అభివృద్ధి కోసం పనిచేస్తున్న 33 సంస్థలు సంయుక్తంగా భూసార సంరక్షణ (భూ సుపోషణ్ మరియు సంరక్షణ్) ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా భూసార సంరక్షణపై రైతులలో అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ ఉద్యమంలో మొదటి విడత చైత్ర శుద్ధ పాడ్యమి (ఉగాది) నాడు ప్రారంభమై మూడు నెలలపాటు కొనసాగుతుంది.

“గత 200 సంవత్సరాలుగా మనం ఆధునిక వ్యవసాయం పేరుతో భూసార సంరక్షణను విస్మరించాం. భూమిని కేవలం ఒక ఆర్థిక వనరుగానే చూస్తూ యధేచ్ఛగా దోచుకుంటున్నాం. భూమిలోని పోషక విలువలను హరిస్తున్నాం. భారతదేశంలోని వ్యవసాయ క్షేత్రాలలో 30 శాతం పైగా భూమిలో భూసారం క్షీణించిపోయింది.

రైతుల అభిప్రాయము, అనుభవం ప్రకారం ప్రస్తుతం వ్యవసాయంలో భారీ పెట్టుబడులు అవసరం అవుతున్నాయి. కానీ దానికి తగిన ఉత్పాదకత, రాబడి ఉండటం లేదు. భూమిలో కర్బన విలువలు తగ్గుతున్న ఫలితంగా ఉత్పత్తి తగ్గుతున్నది. దానికి తోడు భూమి యొక్క నీటి నిల్వ సామర్థ్యము, భూమిలో నీటి నిల్వలు తగ్గడం జరుగుతోంది. పోషక విలువలు లేని భూ వనరుల కారణంగా తీసుకునే ఆహారంలో కూడా పోషక విలువలు తగ్గడం దాని కారణంగా మనుషులు, జంతువులలో వివిధ రకాలైన వ్యాధులు ప్రబలడం మనం గమనిస్తున్నాము. కనుక భవిష్యత్ తరాలను మనం రక్షించుకోవాలంటే భూసారాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా రైతులు ఈ భూసార సంరక్షణ ఉద్యమంలో పాలుపంచుకుని వ్యవసాయ రంగాన్ని పది కాలాల పాటు కాపాడుకోవలసిందిగా కోరుతున్నాం.” అని భూసార సంరక్షణ ఉద్యమ కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.