News

ఎన్కౌంటర్ లో ఐదుగురు మావోయిష్టులు హతం

soldiers lying on the ground with arms
598views

హారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మీడియా వర్గాల వెల్లడించిన సమాచారం ప్రకారం.. కోబ్రామెండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు, మావోలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. ఇంకా అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు. రెండ్రోజుల క్రితం కూడా కోబ్రామెండా అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోలకు మధ్య కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.