
814views
దేశంలో దాడులు జరిపి విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్ ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారనే సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అప్రమత్తమైంది. సోమవారం దేశరాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో సోదాలు జరిపింది. ఢిల్లీ, కర్ణాటక, కేరళలోని 10 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ కుట్రకు సంబంధించి పాక్, ఐసిస్ ముఠాలతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు సమాచారం.
ఉగ్రవాద సంబంధాలపై ఇటీవల కొందరు మహిళలను NIA అధికారులు అదుపులోకి తీసుకోగా.. వారిచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు చేపట్టింది. సోషల్మీడియా వేదికల్లో స్థానిక యువతను ఆకర్షించి, వారికి ఆన్లైన్లోనే శిక్షణ ఇస్తున్నట్లు NIA కు సమాచారం అందింది. వీరి ద్వారా దేశంలో పలు చోట్ల పేలుళ్లు జరిపేందుకు కుట్ర జరుగుతున్నట్లు NIA వర్గాలు వెల్లడించాయి.





