
అయోధ్య రామమందిర నిర్మాణానికి దేశంలోని భక్తులందరూ పెద్ద ఎత్తున నిధులు సమర్పిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మన రాష్ట్రంలో కూడా చిన్నా పెద్దా తేడా లేకుండా బాల బాలికలు, రోజువారి కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయవేత్తలు అందరూ తమ వంతుగా యథాశక్తి నిధులు సమర్పిస్తున్నారు.
ఈ క్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు రాష్ట్రంలోని పలు నగరాలలో ప్రముఖ, ప్రతిష్ఠిత వ్యక్తులతో సమావేశాలు నిర్వహించి వారిని అయోధ్య రామమందిరం నిర్మాణానికి నిధులు ఇవ్వవలసిందిగా కోరుతున్నారు.
ఇందులో భాగంగా విజయవాడ, విశాఖ, నెల్లూరు తదితర నగరాలలో ప్రతిష్టిత వ్యక్తుల సమావేశాలు జరిగాయి. విజయవాడలో జరిగిన మూడు సమావేశాలలో విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శ్రీ రాఘవులు, ఆర్ ఎస్ ఎస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రచారక్ శ్రీ భరత్ కుమార్, మాజీ కేంద్రమంత్రి శ్రీ సుజనా చౌదరి, మాజీ రాష్ట్ర మంత్రి శ్రీ కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమాల ద్వారా పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున నిధులు సమర్పించడానికి ముందుకు వచ్చి తమ రామభక్తిని c చాటుకున్నారు. అలాగే కొందరు ప్రముఖులను వ్యక్తిగతంగా కలిసి కూడా అయోధ్య రామమందిరం నిధిని కార్యకర్తలు కోరుతున్నారు. ఈ క్రమంలో ఆ శ్రీ రామ చంద్రుని పై అత్యంత భక్తి శ్రద్ధలను ప్రదర్శిస్తూ వారు యధాశక్తి నిధులను సమర్పిస్తున్న దృశ్యాలను మాకు అందుబాటైన మేరకు ఈ క్రింద అందిస్తున్నాం.

ప్రముఖుల సమావేశంలో శ్రీ రాంమాధవ్, ఆర్ ఎస్ ఎస్ దక్షిణ క్షేత్ర సహ సంఘచాలక్ శ్రీ దూసి రామకృష్ణ
విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శ్రీ రాఘవులు గారి చేతికి చెక్కును అందజేస్తున్న గవర్నర్ దంపతులు. చిత్రంలో ఆర్ ఎస్ ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర (ప్రాంత) ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ ను కూడా చూడవచ్చు.
చెక్కును అందజేస్తున్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర (ప్రాంత) ధర్మజాగారణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్యకు చెక్కును అందజేస్తున్న MLA శ్రీ ధర్మాన ప్రసాదరావు.

చెక్కును అందజేస్తున్న నెల్లూరు సీనియర్ రాజకీయ వేత్త శ్రీ PV ప్రసన్న రెడ్డి

చెక్కును అందజేస్తున్న మాజీ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి దంపతులు

చెక్కును అందిస్తున్న మాజీ MLA శ్రీ విష్ణు కుమార్ రాజు దంపతులు

చెక్కును అందజేస్తున్న యలమంచిలి MLA శ్రీ కన్నబాబు

కార్యకర్తలకు చెక్కును అందజేస్తున్న జగ్గయ్యపేట MLA శ్రీ సామినేని ఉదయభాను

సీనియర్ ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త శ్రీ శ్రీనివాసరాజుతో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ శ్రీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.
చెక్కును అందజేస్తున్న కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ ఇంతియాజ్

ఆర్ ఎస్ ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర (ప్రాంత) కార్యవాహ శ్రీ వేణుగోపాల్ నాయుడుకు చెక్కును అందజేస్తున్న కడప జిల్లా కలెక్టర్ శ్రీ హరి కిరణ్

విశాఖ సంభాగ్ ప్రచారక్ శ్రీ జనార్ధన్ కు చెక్కులు అందజేస్తున్న కొంతమంది ప్రముఖులు

కార్యకర్తలకు చెక్కును అందజేస్తున్న ప్రముఖ స్థిరాస్తి వ్యాపారి శ్రీ కైలాస్ రెడ్డి

BMR సంస్థ ప్రతినిధిని కలిసిన ప్రాంత ప్రచారక్ భరత్ జీ, మాజీ మంత్రి వర్యులు శ్రీ కామినేని శ్రీనివాస్
చెక్కును అందిస్తున్న విశాఖకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ K. V. ప్రసాద్

చెక్కును అందజేస్తున్న మహారాజా బ్యాంక్ శ్రీ MRK రాజు

చెక్కును అందజేస్తున్న కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ రమణమూర్తి










