
561views
గుంటూరు జిల్లా తెనాలి నగరంలో 4/12/2020 శుక్రవారం సేవాభారతి కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఆర్ ఎస్ ఎస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెనాలి నగరంలోని సీనియర్ స్వయం సేవక్ శ్రీ కోడూరు మల్లికార్జున రావు దంపతులు, ఆర్ ఎస్ ఎస్ గుంటూరు విభాగ్ ప్రచార ప్రముఖ్ శ్రీ అవ్వారు శ్రీనివాస రావు దంపతులు భూమి పూజలో పాల్గొన్నారు.


ఈ కార్యక్రమానికి తెనాలి నగరంలోని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ తమ కుటుంబాలతో సహా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చక్కటి వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమం జరిగింది.





