News

చైనా సైనికుడ్ని పట్టుకున్న ఇండియన్ ఆర్మీ

534views

చైనా ఆర్మీకి చెందిన ఓ సైనికుడిని భారత సైన్యం సోమవారం ఉదయం లద్దాఖ్‌లో దెమ్‌చోక్‌ వద్ద అదుపులోకి తీసుకుంది. అతని వద్ద నుంచి పౌర, సైన్యానికి సంబంధించిన కీలక పాత్రలను స్వాధీనం చేసుకొన్నట్లు సమాచారం. ప్రాథమికంగా వస్తున్న సమాచారం ప్రకారం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)లో కార్పరల్‌ స్థాయి సైనికుడిగా అతడిని గుర్తించారు. జహిజాంగ్‌ ప్రావిన్స్‌లోని షాన్‌జిగ్జ్‌హెన్‌ పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

అంతేకాదు, చైనా సైన్యంలో తుపాకీలను మరమ్మతు చేసేవాడని తెలిసింది. గూఢచారిగా భారత్‌కు వచ్చాడా? లేక మరేదైనా ప్లాన్‌ ఉందా? అతనితో పాటు ఎవరెవరు భారత్‌లో ఉంటున్నారు. ఇక్కడ అతడు ఎవరెవరితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు? తదితర విషయాలపై ఆర్మీ విచారణ చేపట్టింది. పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ప్రొటోకాల్‌ ప్రకారం అతడిని చైనాకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

చైనా సైనికుడు మా అదుపులో ఉన్నది నిజమే : ఇండియన్ ఆర్మీ 

పీఎల్‌ఏకు చెందిన వాంగ్‌ యా లాంగ్‌ అనే కార్పరల్‌ స్థాయి సైనికుడిని లద్ధాఖ్‌లో గుర్తించినట్లు సైన్యం స్పష్టం చేసింది. ఇప్పటికే అతనికి వైద్య సహాయం, ఆహారం, దుస్తులు అందించినట్లు తెలిపింది. నియమ, నిబంధనల ప్రకారం వాంగ్‌ను తిరిగి ఛుషుల్‌ మోల్డో మీటింగ్‌ పాయింట్‌ వద్ద చైనాకు అప్పగించనున్నట్లు తెలిపింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.