News

విజయవాడలో ఘనంగా డాక్టర్. A.P.J.అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం

1.4kviews

విజయవాడ గాంధీ నగర్ లోని పోస్ట్ ఆఫీస్ మాజీ రాష్ట్రపతి డాక్టర్. A.P.J.అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నగరంలోని కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్. ఎస్. ఎస్ విభాగ్ కార్యవాహ రావూరి రామారావు గారు విచ్చేశారు. శ్రీ రామారావు గారు మాట్లాడుతూ అబ్దుల్ కలాం గారు భారత మాత సేవలో నిరంతరం నిమగ్నమై ఉండేవారిని,కృషి చేస్తూ ఉండేవారని తెలిపారు. భారతదేశం సాంకేతిక రంగంలో ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో ఉండటంలో అబ్దుల్ కలాం గారు చేసిన కృషి ఎంతో ఉందని ఆయన వివరించారు. నిరంతరం పరిశోధనలు చేస్తూ ఉన్న ఆయనకి విద్యార్థులతో మమేకమై విద్యార్థులకు విద్యను బోధించాలనే కోరిక ఉండేదని, ఆయనకు అవకాశం వచ్చినప్పుడల్లా విద్యార్థులకు విద్యను బోధించేవారని తెలిపారు. అందుకే ఆయన చివరి క్షణం వరకూ విద్యార్థులతోనే ఉండి విద్యార్థులకు మార్గదర్శనం చేస్తూనే కన్నుమూశారని తెలిపారు. “కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి” అని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉండేవారని,  అదే విధంగా కలలు కని వాటిని సాకారం చేసుకోవడం కోసం నిరంతరం ప్రయత్నం చేయాలని ఆయన తెలిపారు.

అలాగే విజయవాడలోని రామలింగేశ్వర నగర్ శ్రామిక నగర్ బస్తీలో కూడా ఉదయం నగరం లో ఉన్న డాక్టర్ ఏ పి జె అబ్దుల్ కలాం గారి జయంతి కార్యక్రమం జరిగింది…

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.