News

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం

555views

గ్నేయ ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 1500 పూరిగుడిసెలు దగ్ధమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 12:50 గంటలకు ఢిల్లీలోని తుగ్గకాబాద్‌ మురికివాడ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మంటలు రెండు ఎకరాల్లో ఉన్న 1500 గుడిసెలకు విస్తరించాయి. దాదాపు 28 అగ్నిమాపక యంత్రాలతో మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో వందలాది మంది ప్రజలు రోడ్డునపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం అధికారులు నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.