News

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌

987views

త్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మన్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పర్ధోని గ్రామ సమీపంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మదన్‌వాడా ఎస్సై ఎస్‌.కె.శర్మ, మహిళా మావోయిస్టుతో పాటు నలుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలం నుంచి ఏకే 47, రెండు 315 బోర్‌ రైఫిళ్లు, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌ ఆయుధం స్వాధీనం చేసుకున్నట్టు రాజ్‌నందగాన్‌ ఏఎస్పీ జీఎన్‌ బాఘెల్‌ తెలిపారు. మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.