News

విశాఖ విషవాయు బాధితులకు అండదండగా ఆర్. ఎస్. ఎస్

587views

విశాఖపట్నంలోని గోపాల పట్నంలో గల వెంకటాపురం ఎల్. జి పాలిమర్ కర్మాగారం నుండి రసాయన వాయువు తెల్లవారు జామున 3గం ప్రాంతములో లీకైన సందర్భంగా ఆ చుట్టుపక్కల గ్రామాలవారు తీవ్రాతి తీవ్రంగా అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోనికి వెళ్ళినారు. ముఖ్యంగా చంటిపిల్లలు తీవ్ర అస్వస్థతకు గురైనారు. కొంతమంది చనిపోయినారు.  ఆవులు, గేదెలు తదితర జంతువులు కూడా చనిపోయాయి.

ఈ సమయంలో విఙ్ఞాన విహార గుడిలోవ వారి వివేకానంద హాస్పిటల్ అంబులెన్స్ లు కూడా అత్యవసర సేవల నిమిత్తం అక్కడకు చేరుకున్నవి.

వెంకటాపురం, ఆర్ ఆర్ వెంకటాపురం తదితర గ్రామాల ప్రజలు ఇళ్ళను వదలి సింహాచలం, అడవివరం తదితర గ్రామాలకు పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకొన్నారు. చెట్ల క్రింద, సింహాచలం దేవస్థానం సత్రాలలో  తలదాచుకొన్నారు.

వీరికి మాధవధార, సీతమ్మ ధార, ద్వారకానగరం తదితర ప్రాంతాలలోని సంఘ స్వయంసేవకులు సేవలందించారు. భోజన పొట్లాలను ఇళ్ళలో తయారుచేశారు. లలితా పీఠం వారు కొన్ని ఆహార పొట్లాలు తయారు చేసి తీసుకు వచ్చారు. మొత్తం 5000 ఆహార పొట్లాలు వితరణ చేశారు. మంచి నీరు, మజ్జిగ పొట్లాలు బాధితులకు అందజేశారు.

రసాయన వాయువు పీల్చిన కారణంగా ప్రహ్లాదపురం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కళ్ళు మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతున్న ప్రమాదాన్ని పసిగట్టి అక్కడ ఉండే  ప్రజలకు ఉచితముగా  హోమియో మాత్రలను పంచారు. ఇంకా ఆహార పదార్థాల వితరణ కొనసాగుగుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.