News

POK లో భారత్ వాతావరణ సూచనలు

1.3kviews

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఆధిపత్యం సాధించే దిశగా భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట పీవోకే ప్రాంతాల్లో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆధ్వర్యంలో వాతావరణ సూచనలు జారీ చేయనుంది. గతంలో పలు కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో ఐఎండీ వాతావరణ సూచనలు నిలిపివేసింది.

తాజాగా పాక్‌ ఆధీనంలో ఉన్న గిల్గిట్‌-బాల్టిస్తాన్‌, ముజఫరాబాద్‌లలో మే 5 తేదీ నుంచి జమ్మూ-కశ్మీర్‌లోని ప్రాంతీయ వాతావరణ విభాగం (ఆర్‌ఎండీ) ఆధ్వర్యంలో వాతావరణ మార్పులకు సంబంధించి సూచనలు జారీ చేయనున్నట్లు ఆర్‌ఎండీ హెడ్ కుల్‌దీప్‌ శ్రీవాత్సవ తెలిపారు. ఇదే విషయాన్ని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్ ఎమ్.మహపాత్ర స్పష్టం చేస్తూ, ఆ ప్రాంతాలను జమ్మూ-కశ్మీర్‌ సబ్‌ డివిజన్‌లో భాగంగా పరిగణించనున్నట్లు తెలిపారు.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించాలని కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్‌ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, గిల్గిట్‌-బాల్టిస్తాన్‌లు తమ దేశంలో భాగమని, వాటిని ఎప్పటికీ తమ నుంచి వేరుచేయలేరని ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఇదే విషయాన్ని పాక్‌కు స్పష్టం చేయాలనే ప్రధాన ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం పాక్‌ ఆక్రమిత ప్రాంతాల్లో కూడా వాతారణ సూచనలు చేయాలని ఐఎండీకి సూచించినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.