
లలిత కళల ద్వారా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న అఖిల భారతీయ సంస్థ “సంస్కార భారతి” సంస్థాపక కార్యదర్శి అయిన ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త పద్మశ్రీ డా.వాకంకర్ శత జయంతి సందర్భంగా సంస్కార భారతి, ఆంధ్ర ప్రదేశ్ వారు అన్ని తరగతుల బాలబాలికలకు తెలుగు పద్య పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ (1 – 5 తరగతులు) విభాగంలో 1247 మంది, సీనియర్ (6 – 10 తరగతులు) విభాగంలో 999 మంది, మొత్తం 2246 మంది పాల్గొన్నారు.

ఈ పోటీలలో మొత్తం 13 జిల్లాల నుంచి 259 మంది బాల బాలికలు విజేతలుగా నిలిచారని నిర్వాహకులు తెలిపారు.
విజేతలుగా నిలచిన వారి సంఖ్యా వివరాలు జిల్లా వారీగా :
1) నెల్లూరు జిల్లా – 07
2) కర్నూలు జిల్లా – 18
3) తూర్పు గోదావరి జిల్లా – 25
4) అనంతపురం జిల్లా – 30
5) గుంటూరు జిల్లా – 16
6) కృష్ణాజిల్లా – 19
7) పశ్చిమ గోదావరి జిల్లా – 32
8) శ్రీకాకుళం జిల్లా – 17
9) విశాఖపట్నం జిల్లా – 43
10) ప్రకాశం జిల్లా – 05
11) విజయనగరం జిల్లా – 12
12) కడప జిల్లా – 17
13) చిత్తూరు జిల్లా – 08
మొత్తం – 259

గెలుపొందిన వారికి డిజిటల్ ప్రశంసా పత్రాలను నిర్వాహకులు అందజేస్తున్నారు. అంతేకాకుండా లాక్ డౌన్ ముగిసిన తర్వాత విజేతలకు పుస్తకాలను బహూకరిస్తామని సంస్కార భారతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుర్భా శ్రీనివాస్ తెలిపారు.





