NewsSeva

అలుపెరుగని సేవా వ్రతులు SSF కార్యకర్తలు

449views

మరసతా సేవా ఫౌండేషన్ (SSF)  గ్రామాలలో, ముఖ్యంగా దళిత, ఉపేక్షిత బంధువుల వాడలలో ధార్మిక చైతన్యానికై కృషి చేస్తున్నది.  కరోనా లాక్ డౌన్ సందర్భంగా అనేకమంది పేదలు పనులు లేక, తగిన ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భంగా సమరసతా సేవా ఫౌండేషన్ గ్రామాలలో అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

రాష్ట్రమంతటా గ్రామాలలోని పేదలను గుర్తించి వారికి రేషన్ మరియు ఆహార పొట్లాలను పంపిణీ చేసింది. అంతేకాకుండా అనేక సేవా కార్యక్రమాలను కూడా SSF చేపట్టింది.

విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణం సత్యనారాయణపురంలో గల సంచార జాతుల వారికి సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోలపర్తి శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో ఆహార ప్యాకెట్లు నిమ్మరసం పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ నాగేశ్వరావు గారు పట్టణ ధర్మ ప్రచారక్ బుద్ధ సీతారాం తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం రూరల్ మండలం మాల మన్నయ్యపేటలో SSF కార్యకర్తల చొరవతో శ్రీ పంచముఖ దేవాలయం అర్చకులు శ్రీ  శ్రీనివాసులు ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకంగా పూజలు చేసి, ” మా గ్రామం లో కి కొరోనా వైరస్ రాకుండా కాపాడలని” కోరుకున్నారు. అనంతరం SSF కార్యకర్తలు సామజిక దూరం పాటిస్తూ ఇంటింటికీ తీర్థ ప్రసాదములు పంచారు. గ్రామం అంతా  వేపాకు & గుగ్గిళoతో పొగ వేసి,  మురికి కాలువలు దగ్గర శానిటేషన్ చేసి,  గ్రామస్తులకు పలు సూచనలు చేసారు. ప్రతీ ఇంటిలో అందరికి మాస్క్ లు ఉచితంగా పంచారు. SSF కార్యకర్తల కృషిని  పంచాయతీలోని పెద్దలు,  యువకులు,  మహిళలు అందరూ అభినందనoదించారు.

పాడేరు డివిజన్ హుకుంపేట మండలం, బురుగుపుట్టు, సోభకోట సుందృపుట్టు, గ్రామాలలో 76 కుటుంబాల బీద గిరిజన కుటుంబలకు, సమరసతా సేవా పౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల కిట్లు అందించారు. పాడేరు డివిజన్, ధర్మ ప్రచారక్ శ్రీ కిల్లో గంగాధర్, హుకుంపేట మండల ధర్మ ప్రచారక్ శ్రీ ప్రభాకర్, డివిజన్ మహిళా కన్వీనర్ శ్రీ మతి డి. రాజేశ్వరి పంచాయితీ, మహిళా కార్యకర్త శ్రీ మతి కృష్ణకుమారిలు పాల్గొన్నారు.

అర్ధవీడు మండలం పాపినేని పల్లి గ్రామం, భీమ రాయ చెరువు చెంచు గూడెంలో డివిజన్ కన్వీనర్ శ్రీ జీవి రమణారావు మరియు SSF మండల కమిటీ ఆధ్వర్యంలో SSF చే నిర్మింపబడిన గుడి దగ్గర పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీ నారు ఆదినారాయణ రెడ్డి, మహిళా కన్వీనర్ శ్రీమతి జి సుబ్బమ్మ, శ్రీ సుధాకర్ రెడ్డి (పంచాయతీ సెక్రటరీ ), అర్చక స్వామి, ధర్మ ప్రచారక్ మొదలగు వారు పాల్గొన్నారు. నాగులవరం గ్రామస్తులు ఆర్ధిక సహకారాన్ని అందించారు.

అర్చక శిక్షణ కి తిరుపతికి వెళ్లి లాక్ డౌన్ కారణంగా 40 రోజుల నుండి అక్కడే చిక్కుకుపోయిన అర్చకుడు ఎర్రన్న కుటుంబాన్ని డివిజన్ కన్వీనర్ శ్రీ బి దేవుడు, మండల మహిళా కన్వీనర్ శ్రీమతి రమణమ్మలు పరామర్శించి ఎర్రన్న కుటుంబ సభ్యులకు నిత్యవసర వస్తువులు అందజేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.