
మీకు రేషన్ కార్డు ఉందా? ఉంటే మీరు భారతదేశంలోని 17 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో నైనా, కేంద్ర పాలిత ప్రాంతాలలో నైనా రేషన్ సౌకర్యం పొందే అవకాశం ఉన్నదని మీకు తెలుసా?
అవును మీరు చదివింది నిజమే మీకు రేషన్ కార్డు ఉంటే ఆంధ్ర ప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళ, కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, త్రిపుర రాష్ట్రాలలో ఎక్కడైనా రేషన్ పొందడానికి మీరు అర్హులే. వీటి తోపాటు బీహార్, యూపీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, డయ్యు డామన్ లు కూడా ఇప్పుడు అదనంగా కలిశాయి.
దీనితో, 17 రాష్ట్రాలు మరియు యుటిలలోని దాదాపు 60 కోట్ల మంది లబ్ధిదారులకు జాతీయ మరియు అంతర్-రాష్ట్ర పోర్టబిలిటీ సౌకర్యం లభిస్తుంది. వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ ప్లాన్ కింద తమ ప్రస్తుత రేషన్ కార్డును ఉపయోగించడం ద్వారా వారు ఈ 17 రాష్ట్రాలు మరియు యుటిలలో ఎక్కడైనా తమకు నచ్చిన రేషన్ షాప్ నుండి రేషన్ కోటాను పొందవచ్చు.





