
1.3kviews
నాలుగైదు రోజుల క్రితం మతాలకు అతీతంగా “ మానవత్వం పరిమళించింది” అంటూ కొన్ని పత్రికల పతాక శీర్షికలలో ఒక వార్త ప్రత్యక్షమైంది. హైదరాబాదులో ఓ చోట టీబీ తో మరణించిన ఒక ఆటో డ్రైవర్ (హిందువు) మృతదేహం అంత్యక్రియలలో, అక్కడి స్థానిక ముస్లిం యువకులు పాల్గొన్నారని, మృతుని పాడెను మోశారన్నది ఆ వార్త సారాంశం.


వారి సంభాషణ ఆడియో ఈ క్రింద విందాం.
ఆడియో వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అయితే ఆ వార్త ఏదీ నిజం కాదన్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దానికి సంబంధించి హైదరాబాదుకు చెందిన న్యాయవాది ఒకరు మృతుని బంధువులతో ఫోన్ లో మాట్లాడగా, అలాంటి సంఘటన ఏదీ చోటు చేసుకోలేదని, అది తప్పుడు వార్త అని సదరు బంధువు చెబుతున్నట్లుగా ఉన్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ విషయమై తప్పుడు వార్తలు ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించిన వార్తా సంస్థలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.





