NewsSeva

అంతరాలెరుగని సేవా నిరతి

431views

లాక్ డౌన్ కారణంగా రెక్కాడితే గాని డొక్కా డని అనేకమంది నిరుపేదలు తమ దైనందిన అవసరాలు తీరక అగచాట్లు పడుతున్న సంగతి మనకు తెలిసిందే.

కులమతాలకు అతీతంగా సేవలందిస్తున్న స్వయంసేవకులు

అటువంటి వారికి జన సంక్షేమ సమితి, సేవా భారతి, ఆర్ ఎస్ ఎస్ మరియు సమరసతా సేవా ఫౌండేషన్ కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు. లాక్ డౌన్ మొదలవక ముందునుంచే అనేక సేవా బస్తీలలో రోగనిరోధక శక్తిని పెంపొందించే మందులు పంపిణీ చేయడం తోపాటు, ఆయా ప్రాంతాలను శుభ్రం చేయడం, శానిటైజేషన్ చేయడం వంటి కార్యక్రమాలకు వారు శ్రీకారం చుట్టారు.

ఆపన్నులకు సహాయమందిస్తున్న SSF కార్యకర్తలు

లాక్ డౌన్ మొదలయ్యాక సేవా బస్తీలలోనూ మరియు ఇతర ప్రాంతాలలోనూ పూట గడవడానికి ఇబ్బందిపడుతున్న నిరుపేదలను గుర్తించి వారికి నిత్యవసర వస్తువులను అందించడం, గూడు లేక రోడ్డు పక్కన నివసించేవారికి ఆహార పొట్లాలు అందించడం, విధి నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య సిబ్బందికి, పోలీసువారికి మజ్జిగ, తేనీరు వంటివి అందించటం, వివిధ బస్తీలలోని వారికి కూరగాయలు, చేతి తొడుగులు, ఫేస్ మాస్కులు, శానిటైజర్ల వంటివి అందించడం చేశారు. అవసరమైనవారికి, ముఖ్యంగా పారిశుధ్య కార్మికులకు ఒక టీ షర్టు, టవలు, లుంగీ కలిగిన కిట్లను కూడా పలుచోట్ల పంపిణీ చేశారు.

నిత్యావసరాల కిట్లను సిద్ధం చేస్తూ…

జిల్లాలోని 90 ప్రాంతాలలో 5947 కుటుంబాలు ఈ సేవా కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందాయి. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికారుల అనుమతులతో 306 మంది కార్యకర్తలు ఈ సేవా కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. ఆ వివరాలను ఈ క్రింద పొందుపరచిన పట్టికలలో చూడగలరు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.