News

రంజన్‌ గొగోయ్ ప్రమాణం

551views

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులో తన సభ్యత్వం గురించి ఆయన సమర్థించుకున్న ఆయన, తన హజరుతో న్యాయవ్యవస్థకు సంబంధించిన విషయాలను పార్లమెంటులో చర్చించే అవకాశంగా భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే, రంజన్‌ గొగొయిను రాజ్యసభకు నామినేట్‌ చేస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. అనంతరం రాజ్యసభ సభ్యునిగా నామినేట్‌ చేస్తూ హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాల నుంచి పలు విమర్శలు ఎదుర్కొన్న గొగొయి, ప్రమాణస్వీకార సమయంలోనూ రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుల నిరసనలను ఎదుర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.