NewsSeva

సేవా భారతి ఉచిత హోమియో మందుల పంపిణీ

79views

రోజు గుంటూరులో సేవా భారతి ఆధ్వర్యంలో కరోనా వ్యాధి నివారణ కొరకు ఉచితంగా హోమియో మందులను అందించారు. అమరావతి రోడ్డులోని హిందూ కాలేజీ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలో 200 మంది విద్యార్థులకు వారి కుటుంబాలకు సరిపడా హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవాభారతి రాష్ట్ర సంఘటన కార్యదర్శి శ్రీ పృధ్వీరాజు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సింగరాజు వెంకటరమణ, కళాశాల డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్, రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మందులను పంపిణీ చేశారు . ఇంజనీరింగ్ కళాశాల నుండి స్టాఫ్ పాల్గొని మందులు స్వీకరించారు.

శ్రీ పృధ్వీ రాజు మాట్లాడుతూ కరోనా వ్యాధి నివారణ మన చేతుల్లోనే ఉంది అని తెలియజేశారు. దగ్గు, జలుబు, తలనొప్పి, జ్వరం వచ్చన వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు . ఊపిరి అందటం కష్టంగా ఉన్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ కావాలి అని తెలియజేశారు. హోమియో మాత్ర కేవలం నివారణకు  మాత్రమే అంటే వ్యాధి రాకముందు మాత్రమే పనిచేస్తాయని ఒకసారి వ్యాధి వచ్చిన తర్వాత ప్రస్తుతానికి మందు లేదు  అని తెలియజేశారు. చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని తెలియజేశారు. ప్రతిరోజు రాత్రి నాలుగు మాత్రలు వరుసగా మూడు రోజులు వేసుకోవాలి,  అరగంట ముందు అరగంట తర్వాత ఆహారం తీసుకోకుండా ఉండాలి అని తెలియజేశారు. 20 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రతిరోజు రాత్రి 2మాత్రలు వరుసగా మూడు రోజులు వేస్తే సరిపోతుందని తెలియజేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.