
ముత్తుకూరు మండలం వల్లూరు పంచాయతీ అచ్చంతోపు గ్రామంలో సామాజిక సమరసతా సేవా ఫౌండేషన్ వారు నిర్మించిన దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్, జయభారత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వారు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో సుమారు వందమంది రోగులు పాల్గొన్నారు. వీరికి వైద్య పరీక్షలు మరియు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం జరిగినది. వీరిలో 20 మందికి కంటి శస్త్ర చికిత్స అవసరమని డాక్టర్ గారు నిర్దారించగా వారికి హాస్పిటల్ నందు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు.


ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీ లక్ష్మి గారు పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ జయభారత్ హాస్పిటల్ నందు అతి తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. అదేవిధంగా స్థానిక సమరసత సేవా ఫౌండేషన్ మండల ధర్మ ప్రచారక్ శ్రీ శ్రీ సుధాకర్ డివిజనల్ ధర్మ ప్రచారక్ శ్రీ కార్తికేయ మండల కన్వీనర్లు పాల్గొన్నారు.





