
ఢిల్లీ హిందూ వ్యతిరేక అల్లర్లలో దల్బీర్ సింగ్ నేగి అనే వ్యక్తి హత్య కేసులో పోలీసులు షహనావాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
దల్బీర్ సింగ్ నేగిని ముస్లింల అల్లర్ల గుంపు అవయవాలను కత్తితో నరికి, ఆ తర్వాత సజీవ దహనం చేసి చంపారు. ముందుగా చేతులు, కాళ్ళు నరికిన తరువాత, అతని శరీరంలోని మిగిలిన భాగాలను మంటల్లోకి విసిరారు.
ఢిల్లీ హిందూ వ్యతిరేక అల్లర్ల సందర్భంగా ఫిబ్రవరి 24 న 20 ఏళ్ల దిల్బార్ సింగ్ నేగిపై దారుణ హత్యకు పాల్పడిన షహనావాజ్ అనే నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ముక్కలు ముక్కలైన అతని మృతదేహం తరువాత ఫిబ్రవరి 26 న బ్రిజ్‌పురిలోని అనిల్ స్వీట్ హౌస్‌లో దొరికింది.
ఈ సంఘటనను మొదట ఒపిండియా వెల్లడించింది. మరణించిన దల్బీర్ బంధువులు ఒపిండియాను సంప్రదించి జరిగిన ఘోరం గురించి వెల్లడించారు. దల్బీర్ సింగ్ ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్హ్వాల్ నుంచి 6 నెలల క్రితం ఢిల్లీ వచ్చారు. అతను శివ విహార్లో ఉన్న ఒక మిఠాయి దుకాణంలో పనిచేసేవాడు. మరణించిన వారి కుటుంబానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది.

ఫిబ్రవరి 23 సాయంత్రం కొంతమంది అల్లరి గుంపు షాహదరా ప్రాంతంలోకి ప్రవేశించాయని అతని సన్నిహితుడు శ్యామ్ సింగ్, ఒపిండియాతో చెప్పారు. అల్లరి మూక నెగిని తమ మొదటి లక్ష్యంగా చేసుకున్నారు. వారు అతని చేతులు మరియు కాళ్ళను నరికివేశారు. ఆ తర్వాత వారు అతని సజీవ దేహాన్ని సమీపంలోని దుకాణంలో కాల్చారు. అతనితో పాటు భవనంలో ఉండిన మిగిలిన ఇద్దరు సహచరులు మాత్రం అక్కడి నుండి తప్పించుకోగలిగారు.
ఫిబ్రవరి 26 న, దుకాణ యజమాని అనిల్ పాల్ పోలీసులతో తన దుకాణం యొక్క పరిస్థితిని తెలుసుకోవడానికి సంఘటన స్థలానికి చేరుకున్నప్పుడు, అతను రెండవ అంతస్తులోని మెట్ల మార్గం సమీపంలో మరణించిన నేగి మృతదేహాన్ని కనుగొన్నాడు. అల్లర్లను చూసిన తరువాత అతను భవనం నుండి దూకడానికి ప్రయత్నించి ఉంటాడని మనం అనుకోవచ్చు.
ఢిల్లీ హిందూ వ్యతిరేక అల్లర్లలో 42 మంది మరణించారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. ఖిలాఫత్ 2.0 యొక్క వివాదాస్పద లక్ష్యానికి ఆజ్యం పోసిన తీవ్రవాద ముస్లిం మూకలు వీధుల్లో చేసిన హింస వ్యక్తిగత మరియు ప్రజా ఆస్తులకు గణనీయమైన నష్టాన్ని కలిగించింది. వారు ఇళ్ళు, దుకాణాలు, వాహనాలు తగులబెట్టడం, ఒక పెట్రోల్ పంప్ పేల్చివేయడమే కాకుండా స్థానిక ప్రజలు మరియు పోలీసు సిబ్బందిపై కాల్పులు కూడా జరిపారు.
Source: OPIndia





