
దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులకు దాని వెనకున్న అప్రకటిత సంఘవిద్రోహ శక్తుల కు సమాధానంగా హిందూ పరిరక్షణ వేదిక నంద్యాల వారి ఆధ్వర్యంలో లో జరిగిన హిందూ సంఘటన ర్యాలీలో దాదాపు 6 వేలకు పైబడి హిందూ సోదరులు మరియు మాతృమూర్తులు “గడప లోపలే కులం గడప దాటితే హిందువులం” అంటూ నినదిస్తూ కదిలారు.
ఈ సందర్భంగా వివిధ కుల సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ మనమంతా సంఘటితంగా ఉన్నప్పుడే ఈ దేశంలో హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేయగలమని , హిందూ శక్తిని తక్కువ అంచనా వేస్తే పొరపాటు పడినట్లేనని తెలియజేశారు.
ప్రధాన వక్త శ్రీ సుధాకర్ మాట్లాడుతూ హిందూ దేశంలో హిందువులకు రక్షణ కరువైందని దేశ రాజధాని ఢిల్లీలో సామాన్య ప్రజలు , పోలీసువారికి మరియు సైన్యానికి కూడా భద్రత లేకుండా పోయిందని, మతోన్మాద శక్తుల అల్లర్లలో అసువులు బాసిన 37 మంది హిందువులకు అంకిత్ శర్మ , రతన్ లాల్ లాంటి అధికారులకు నివాళులర్పించారు.
“హిందూ పరిరక్షణ వేదిక” వారు మాట్లాడుతూ రాజకీయ నాయకులు దేశ భద్రత కోసం తెచ్చిన చట్టాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఎన్నాళ్ళు పబ్బం గడుపుకుంటారని సూటిగా ప్రశ్నించారు. హిందూ సమాజం ఎంత బలమైనదో చూపించే ప్రక్రియలో ఇది కేవలం మొదటిమెట్టు మాత్రమేనని తెలియజేస్తూ ఈ నిరసన ర్యాలీ కి స్వచ్చందంగా వచ్చి విజయవంతం చేసిన అన్ని కుల సంఘాల వారికి, వ్యాపార అసోసియేషన్ల వారికి, నంద్యాల నగర హిందూ సమాజానికి మరియు గ్రామీణ హిందువులకూ ర్యాలీకి సహకరించిన పోలీసువారికి మరియు మీడియా మిత్రులకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యక్రమంలో రజక సంఘం శ్రీ జిల్లెళ్ళ శ్రీరాములు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ మేడ.లక్ష్మయ్య, పురపాలక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు శ్రీ విజయ్ కుమార్, BC సంఘం నాయకుడు శ్రీ రమణయ్య గౌడ్, బీజేపీ నాయకులు శ్రీ మేడా.మురళీధర్, జిల్లా అధ్యక్షులు శ్రీ బుడ్డా.శ్రీకాంత్ రెడ్డి, MRPS నాయకులు శ్రీ శ్రీనివాస్, వాల్మీకి సంఘం నాయకులు అలాగే మాతృమిత్ర నుండి కుమారి మానస ప్రసంగించారు.