News

పహల్గామ్, పుల్వామా దాడులపై మౌనం వహించిన కాశ్మీరీ ముస్లింలు ఇరాన్‌కు నిధులు ఎందుకు సమకూరుస్తున్నారు? రాజా సింగ్

141views

గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజా సింగ్ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులు, అలాగే ఇరాన్  అంతర్జాతీయ ఘటనలపై భారతదేశంలోని ముస్లిం సమాజం స్పందనపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.

పహల్గామ్‌లో మత ప్రాతిపదికన హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని హత్య చేసినప్పుడు మీరంతా (కాశ్మీరీ ముస్లింలు) ఎక్కడ ఉన్నారు?, అలాగే పుల్వామాలో సైనికులపై జరిగిన ఉగ్రదాడుల సమయంలో ఆ సైనికుల కుటుంబాలకు అండగా నిలవడానికి  ముందుకు రాలేదు.వారికి  సహాయం అందిచ్మ్డంలో  కాశ్మీరీ ముస్లింల పాత్ర ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆ ఘటనల్లో బాధితులకు మద్దతుగా ఎంతవరకు సహాయం అందించారో వివరించాలన్నారు.

అలాగే, ఇటీవల అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ఘటనలను ప్రస్తావిస్తూ, ఒక దేశం మరొక దేశంపై దాడి చేసి అక్కడి మత గురువు మరణించిన సందర్భంలో భారతదేశంలోని ముస్లింలు ఎందుకు సంతాపం వ్యక్తం చేస్తున్నారనే అంశంపై ఆయన సందేహం వ్యక్తం చేశారు.

అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడి చేసి, ఆ దేశ సర్వోన్నత మత గురువు అయిన అయతోల్లా అలీ ఖమేనీని 72 మంది ‘హూర్ల’ (స్వర్గ కన్యల) చెంతకు పంపాయి. ఈ దాడి జరిగింది ఇరాన్‌లో, దాడికి పాల్పడిన దేశం పూర్తిగా వేరొకటి; అయినా సరే, మన దేశంలో ఇక్కడ ఎందుకు సంతాపం పాటిస్తున్నారు? అని ప్రశ్నించారు.

ఇరాన్‌కు ఆర్థిక సహాయం అందించేందుకు కాశ్మీర్‌లో కొంతమంది విరాళాల సేకరణకు ప్రయత్నిస్తున్నారని వచ్చిన వార్తల నేపథ్యంలో కూడా రాజా సింగ్ స్పందించారు. ఈ సందర్భంలో, దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసే భారత సైనికుల పట్ల అదే స్థాయిలో సానుభూతి ఎందుకు కనిపించడంలేదని ఆయన ప్రశ్నించారు.  ఈ ప్రశ్నలు ఇప్పుడు  చర్చనీయాంశంగా మారాయి