News

బంగ్లాదేశ్‌లో శ్రీరామ నవమిని భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ‘అగ్నివీర్’ సంస్థ

65views

‘బంగ్లాదేశ్ అగ్నివీర్’ అనే ఒక   హిందూ సంస్థ,  మార్చి 27న బంగ్లాదేశ్   సిల్హెట్ లోని   లామా బజార్‌లో త్రి దేవాలయ సమాజంలో శ్రీ రామ నవమిణి ఉత్సవాన్ని అత్యంత ఉత్సాహంతో,  భక్తిశ్రద్ధలతో  నిర్వహించింది.   శివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సమాజానికి చెందిన వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ వేడుక గురించి స్థానిక హిందువులు తెలియజేశారు.

కార్యక్రమంలో భాగంగా  సీతా రాములకు ప్రత్యేక పూజలు చేసి  ఆ తర్వాత భక్తి గీతాలను ఆలపించారు.    మూడు చిన్న బృందాలుగా విభజించి, పిల్లల  కోసం ఒక చిత్రలేఖన పోటీని  ప్రదర్శనను నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముని జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు, సర్వుల శ్రేయస్సును కాంక్షిస్తూ ‘వైదిక శాంతి యజ్ఞం’ నిర్వహించారు. ఆ తర్వాత ‘బ్రహ్మ సంగీతాన్ని’ వినిపించారు. ఈ కార్యక్రమం అనంతరం ఒక చర్చా గోష్ఠిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలు, యువత యొక్క ఆరోగ్యకరమైన మానసిక వికాసానికి వారు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం ఎంత ఆవశ్యకమో తెలియజేశారు