
1.6kviews
CAA వ్యతిరేక నిరసనకారులు కేంద్ర ప్రభుత్వంపై, దేశ సార్వభౌమాధికారంపై యుద్ధంప్రకటించినట్లున్నారు. ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఉద్యోగి ఈశాన్య ఢిల్లీలోని చాంద్‌బాగ్ ప్రాంతంలో మృతిచెందినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న ఘర్షణల్లో భాగంగా నిరసనకారులు జరిపిన రాళ్ల దాడిలోనే అంకిత్ శర్మ(26) చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహం డ్రైనేజీలో లభ్యమయిందని బంధువులు పోలీసులకు తెలిపారు. శవపరీక్ష నిమిత్తం ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని గురు తేగ్ బహదూర్ ఆస్పత్రికి తరలించారు. 2017లో విధుల్లో చేరిన అంకిత్ ‘సెక్యూరిటీ అసిస్టెంట్’ హోదాలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఈశాన్య దిల్లీలో ఘర్షణలు తలెత్తిన విషయం తెలిసిందే.






