News

వారు మతి స్థిమితం లేని వారా? మత స్థిమితం లేనివారా?

722views

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 23 దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన విచారణను సీబీఐకి అప్పగించాలని శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ డిమాండ్ చేశారు. రాష్ట్రీయ హిందూ సేన ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో ఆదివారం రాత్రి జరిగిన సనాతన ధర్మ పరిరక్షణ సభలో ఆయన ముఖ్య  అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం ఘటన తో పాటు, రాష్ట్రంలో పలు ప్రాంతాలలో జరిగిన ఉదంతాలను గుర్తు చేశారు. ఇవన్నీ మతిస్థిమితం లేనివారే చేశారని పోలీసులు చెబుతున్నారని, మతిస్థిమితం లేని వారా? మతస్థిమితం  లేని వారా? ఎవరు చేశారో వాస్తవాలు వెలుగు చూడాలంటే సిబిఐకి అప్పగించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం సిబిసిఐడి దర్యాప్తు జరుపుతున్నా 15 రోజులుగా నిందితులను గుర్తించ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం వీడని పక్షంలో మార్చి 1న పిఠాపురంలో 30 వేల మందితో సహస్ర కలశాలతో అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. ఇందుకు తాము సహకరిస్తామని బిజెపి ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు సభలో ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వ వైఖరిలో మార్పు రాని పక్షంలో దీక్ష చేపడతామని హెచ్చరించారు. “మోడీ, అమిత్ షా లకు ప్రాణ గండం ఉన్నదని మదర్సాలలో చర్చ జరుగుతోందని” ముల్లా చేసిన ప్రకటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని, మసీదులు, చర్చిలపై ఈ విషయమై నిఘా ఉంచాలని స్వామీజీ డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.