NewsProgramms

విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు

1.1kviews

విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో మండల స్థాయిలో ప్రైమరీ విద్యార్థులకు జరిగిన “క్విజ్” పోటీలలో 23 జట్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలోకలిగిరి మండల MEO శ్రీ అబ్దుల్ రజాక్, హైస్కూల్ HM శ్రీ శ్రీరామ్మూర్తి, పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు ఆరోగ్యవంతమైన పోటీ తత్వాన్ని పెంచుకోవాలని, ఇలాంటి పోటీలు పిల్లలలో పోటీ తత్వాన్ని, గెలవాలనే ఆకాంక్షను కలిగిస్తాయని వారు పేర్కొన్నారు. అంతే కాక ఇలాంటి పోటీల వల్ల పిల్లలలో అధ్యయన శీలత కూడా పెరుగుతుందని వారు తెలిపారు.

ఇలాంటి పోటీలు, విజ్ఞాన ప్రదర్శనలు వంటివి నిర్వహించటం ద్వారా విజ్ఞాన భారతి, బాల బాలికలలో సృజనాత్మకతను వెలికి తీస్తున్నదని, విజ్ఞాన భారతి కృషి అభినందనీయమని వక్తలు ప్రశంసించారు.

అనంతరం గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు, శాస్త్ర వేత్తల పుస్తకాలు, నగదు బహుమతులు అందజేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.