
950views
ఇవాళ ఉదయం ఢిల్లీ చేరుకున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. మిలటరీ డే సందర్భంగా సైనిక అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి గతంలో విరాళంగా ప్రకటించిన రూ.కోటి చెక్కును ¸కేంద్రీయ సైనిక బోర్డు కార్యదర్శి బ్రిగేడియర్ మృగేందకుమార్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ సైనిక కుటుంబాల సంక్షేమం కోసం తనవంతు సహాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. సైనిక కుటుంబాలకు సహాయం చేయాలని బ్రిగేడియర్ మృగేందకుమార్ వ్రాసిన లేఖ తన మనసును తాకిందన్నారు. అందుకే కోటి రూపాయలు విరాళంగా అందజేసినట్లు చెప్పారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు .. సైనికుల కుటుంబాలకు సహాయం చేయాలని కోరారు. మధ్యాహ్నం విజ్ఞాన్ భవన్‌లో జరిగే ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పవన్ పాల్గొననున్నారు.