
134views
కాకినాడ నుంచి భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానానికి సుమారు 200 మందికి పైగా భక్తులు పాదయాత్రగా తరలి వెళ్లారు. కాకినాడలోని అచ్చంపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి వాసుదేవ గురుస్వామి సారథ్యంలో గురువారం బయలుదేరిన శ్రీ భద్రాద్రి దివ్య రథోత్సవ పాదయాత్రకు మూడో రోజు కొయ్యలగూడెంలో ఘన స్వాగతం లభించింది. గ్రామస్థులు పాదయాత్రగా వచ్చిన భక్తులకు అల్పాహారం అందజేసి వారికి వీడ్కోలు పలికారు. ఈ పాదయాత్ర ఈ నెల 11 తేదీ నాటికి భద్రాచలం చేరుకుంటుంది





