
ఆస్ట్రేలియాలోని బోండి ప్రాంతంలో జరిగిన దాడులకు ముస్లింలు బాధ్యత తీసుకోవాలని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని స్కాట్ మారిసన్ డిమాండ్ చేశారు. అలాగే ముస్లిం సమాజంలో పూర్తి సంస్కరణలు రావాలని, జవాబుదారీతనం, బాధ్యతఅన్న లక్షణాలు కూడా పెంపొందాలని మాజీ ప్రధాని సూచించారు. అలాగే ఆస్ట్రేలియాలో ఇస్లామిక్ మత బోధనలను కూడా నియంత్రించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇస్లామిక్ మత బోధకుల కోసం ఓ రిజిస్టర్ ను తీసుకురావాలని, అలాగే అక్రిడేషన్ వ్యవస్థ కూడా తీసుకురావాలని డిమాండ్ చేశారు.
అయితే.. ఈ సూచనలపై అక్కడి ముస్లిం సమాజం తీవ్రంగా మండిపడుతోంది. స్కాట్ మోరిసన్ ఇస్లామోఫోబిక్ కథనాలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొంటున్నారు. అలాగే హింసాత్మక చర్యలకు ముస్లింలను అన్యాయంగా నిందిస్తున్నారని అంటున్నారు.
గత యేడాది డిసెంబర్ మాసంలో ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండి బీచ్ లో ఐఎస్ఐఎస్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సుమారు 15 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రటకించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, దాడి చేసిన ఓ వ్యక్తిని ఎదురు కాల్పుల్లో చంపారు. ఈ మృతుడిని సాజిద్ అక్రమ్ (50) గా గుర్తించినట్లు పోలీసులు ప్రకటించారు. ఇదిలావుంటే, సిడ్నీ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్‌తో సంబంధాలు బయటపడినట్లు తెలుస్తోంది.





