News

PFI నేతలతో AAP, కాంగ్రెస్ చెట్టపట్టాల్ – వెల్లడించిన ED

1.1kviews

షాహీన్ బాగ్ షూటర్ ఆప్ సభ్యుడని వెల్లడించిన వెంటనే, షాహీన్ బాగ్ సిఎఎ వ్యతిరేక నిరసనకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) నిధులు సమకూర్చిందని, ఆమ్ ఆద్మీ పార్టీ మరియు కాంగ్రెస్ నాయకులు పిఎఫ్‌ఐ చీఫ్ తో నిరంతరం సన్నిహితంగా ఉన్నారని ఒపి ఇండియా వెల్లడించింది. షాహిన్ బాగ్‌లో జరిగిన సిఎఎ వ్యతిరేక నిరసన కార్యక్రమంలో ఢిల్లీ పిఎఫ్‌ఐ అధ్యక్షుడు మహ్మద్ పర్వేజ్ అహ్మద్ మరియు ఇతర సభ్యులు చురుకుగా పాల్గొన్నట్లు ఒపి ఇండియా విడుదల చేసిన ఇడి పత్రాల ప్రకారం తెలుస్తోంది.

అంతేకాకుండా,  ఎండీ పర్వేజ్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ తో వాట్సాప్ చాట్లు, ఫోన్ కాల్స్ ద్వారా క్రమం తప్పకుండా సంప్రదిస్తుండటమే కాక తరచూ ఆయనను కలుస్తూ ఉన్నట్టు కూడా ఇడి దర్యాప్తులో తేలింది. ఇంకా, పర్వేజ్ ఉదిత్ రాజ్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులతో కూడా సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది.

షాహీన్ బాగ్ నిరసనలకు నిధుల గురించి, ఒపిండియా ఇచ్చిన నివేదిక ప్రకారం, పిఎఫ్‌ఐ కార్యకర్తలు మరియు సభ్యులు భారతదేశం అంతటా ప్రజల నుండి నగదు సేకరించి తమ తమ ప్రాంతాలలోని నిర్దిష్ట వ్యక్తులకు అప్పగించారు. వారు నగదును ఢిల్లీలోని పిఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యాలయం షాహీన్ బాగ్ లో జమ చేయడానికి వెళ్లారు.

నిన్న, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ MHA కి ఒక నివేదికను సమర్పించింది. అందులో అది AAP, కాంగ్రెస్ మరియు భీమ్ ఆర్మీతో ఇస్లామిస్ట్ సంస్థకున్న సంబంధాలను వెల్లడించింది. ‘భీమ్ ఆర్మీ టాప్ -100’, ‘Unification of Muslim Leadership’ (‘ముస్లిం నాయకత్వ ఏకీకరణ’) వంటి అనేక వాట్సాప్ గ్రూపులలో పర్వేజ్ సభ్యుడని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పత్రాలు వెల్లడించాయి. 4 డిసెంబర్ 2019 మరియు 2020 జనవరి 6 మధ్య, వివిధ అకౌంట్ల నుంచి 1.34 కోట్లకు పైగా విత్ డ్రా అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బు CAA వ్యతిరేక నిరసనల  పేరిట వినాశనం కలిగించడానికి, హింసాత్మక దాడులకు కొందరిని ప్రేరేపించడానికి ఈ డబ్బు వినియోగించబడిందని, అల్లర్లలో పంపిణీ చేయబడిందని ఒపి ఇండియా నివేదిక పేర్కొంది.

షాహీన్ బాగ్ భారత వ్యతిరేక మరియు హిందూ వ్యతిరేక కుతంత్రాల కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. ఇది ‘జిన్నా- వాలి’ ఆజాదిని కోరుకుని, భారతదేశం యొక్క నార్త్ ఈస్ట్ ను కత్తిరించాలని కోరుకునే వారి వాదనలను ప్రోత్సహించింది. ఆప్ ముస్లిం ఓట్లను సేకరించడానికి సిఎఎ వ్యతిరేక నిరసనలను ఉపయోగించుకోజూస్తోంది. అలాగే దాని ఎంపిలు, ఎమ్మెల్యేలు ఇప్పుడు పిఎఫ్ఐ వంటి ఇస్లామిస్ట్ తీవ్రవాద సంస్థలతో సాన్నిహిత్యాన్ని కలిగున్నారు. భారతీయ వ్యతిరేక సంస్థలతో తమకున్న సాన్నిహిత్యంపై ఆప్ ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు చాలా వివరణలు ఇవ్వవలసి ఉంది.

Source : Organiser.

https://www.organiser.org/Encyc/2020/2/7/ED-reveals-Shaheen-Bagh-CAA-protests-funded-by-PFI.html

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.