
79views
ధర్మాన్ని కాపాడండి.. ఆ ధర్మమే అందరినీ కాపాడుతుంది అని పరమపూజ్య శ్రీధర్ చరణ్‌దాస్ స్వామి అన్నారు. అన్నమయ్య జిల్లా కలకడ మండలంలోని ఎనుగొండపాళ్యం పంచాయతీ దిగువపాళ్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హిందూ సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఆలయంలో నిత్య ధూపదీప నైవేద్యం కొనసాగేలా సహకారం అందించాలన్నారు. చేసే పనిలో మంచి ఉండాలని, భక్తితోనే ముక్తికి మార్గం సాధ్యమని తెలియజేశారు.





