News

వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం శ్రీధర్ జీ సేవలు మరువలేనివి

243views

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించిన స్వర్గీయ కొయ్యాడా శ్రీధర్ జీ సేవలు మరువలేనివి అని వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం జాతీయ అధ్యక్షులు సత్యేంద్ర సింహ పేర్కొన్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు తలారిసింగి వద్ద వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం ఆధ్వర్యంలో స్వర్గీయ కొయ్యాడా శ్రీధర్ జీ జ్ఞాపకార్ధం నిర్వహించిన మెగా వాలీబాల్ పోటీలకు ముఖ్య అతిదిగా ఆయన పాల్గోని మాజీ శాసన సభ్యులు గిడ్డి ఈశ్వరి,జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ గంగులయ్య,బీజేపీ జిల్లా అధ్యక్షులు మఠం శాంత కుమారి, క్షేత్ర సంఘటన కార్యదర్శి శివ రామకృష్ణ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మెగా వాలీబాల్ పోటీలను ప్రారంభించారు.

అనంతరం అయన మాట్లాడుతూ ఆదివాసీ ప్రజల వికాసం కోసం తన చివరి శ్వాస వరకు పనిచేసారని అన్నారు, ముఖ్యం గా విద్య, వైద్యం, ప్రజా చైతన్యం కోసం విశేషంగా కృషి చేసారని తెలిపారు.
వారి జ్ఞాపకార్ధం ఈ పోటీలు నిర్వహించడం ఆనందదాయకం అన్నారు.

కాగా 11 మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొనగా హోరా హోరుగా సాగిన ఈ వాలీబాల్ పోటిల్లో సెమీ ఫైనల్ కి ఫోల్ ఏ లో అరకు బీ టీం, కండ్రుమ్ టీం, ఫోల్ బీలో కొత్త వలస టీం, అరకు ఏ టీం చేరుకుందని అన్నారు.