News

ఫిబ్రవరి 8 నుంచి మార్చి 18 వరకు శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

116views

శ్రీశైలంలో శ్రీశైల దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్‌లో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్‌తో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈసమావేశంలో నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, ఆత్మకూరు, దోర్నాల, శ్రీశైలం డీఎఫ్వోలు విగ్నేష్ అపోవా,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 8 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో దేవస్థానం సిబ్బంది, పోలీస్, జిల్లా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన, సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది సుమారు ఏడు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది దర్శనం వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా పనులు చెయ్యాలి లక్షలాది మంది పాదయాత్ర భక్తులు సుమారు 46 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చే మార్గాల్లో మెడికల్ క్యాంపులు,అంబులెన్సులు, డస్ట్‌బిన్లు, టాయిలెట్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది భీముని కొలను, కైలాసద్వారం ప్రాంతాల్లో భక్తులు ఆరోగ్య ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నందున స్ట్రెచర్లు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఇతర జిల్లాల నుంచి దాదాపు 1800 బస్సులు వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పటిష్టమైన ప్రణాళికతో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని, తిరిగి వెళ్లే మార్గాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. భక్తులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు హెల్ప్‌డెస్క్‌లు, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు